ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని తెలిపారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటిస్తున్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉందని.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటిస్తున్న మీరే తమ ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని.. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి…
ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంటి మీదకు వచ్చి బెదిరిస్తారు.. తిడతారు.. కొడతారు. కానీ ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తీర్చలేదని బాలుడిని కిడ్నాప్ చేశాడు ఆళ్లగడ్డ వైసీపీ కౌన్సిలర్ వరలక్ష్మి కుమారుడు సుధాకర్. తీసుకున్న అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు.
Kurnool MP Candidate: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుకను ఖరారు చేసింది. శనివారం ఈ రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. విముఖత చూపిన కారణంగానే గుమ్మనూరు జయరాంకు వైసీపీ మంగళం పాడేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముందుగా గుమ్మనూరు జయరాంను వైసీపీ…
ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత 4 రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు గడిపారు. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదట
ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని…
ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు.