తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపుకు వెళుతున్న ఆయన తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నంద్యాల నుండి కర్నూల్ వైపు వెళ్తున్న సమయంలో తమ్మరాజు పల్లె వద్ద కారు అదుపుతప్పి గేదెలను ఢీ కొట్టింది. అయితే అదృష్టం కొద్దీ కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ సమయానికి ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఫరూక్ కు స్వల్ప గాయాలయ్యాయి.
Also read: Prathinidhi 2 : ఎన్నికల్లోపే ప్రతినిధి కూడా.. ఆరోజే రిలీజ్
పాణ్యం మండలం తమ్మరాజు పల్లె వద్దకు చేరుకున్న సమయంలో రోడ్డుపై అడ్డంగా గేదెలు వచ్చాయి. అయితే ఊహించని పరిస్థితుల నేపథ్యంలో కారు అదుపు తప్పింది. కారు గేదలను ఢీకొట్టగా కారు ముందు భాగం మొత్తం ననుజ్జునుజ్జు అయింది. అయితే అదృష్టం కొద్ది కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో ఫరూక్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక సంఘటన జరిగిన తర్వాత ఆయన నంద్యాలలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ట్రామా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పార్టీ కార్యకర్తలు పరామర్శించేందుకు ఆసుపత్రికి భారీగా తరలిస్తున్నారు.