నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్! కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా…