Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.