ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు. నిత్యం వివాదాలమయంగా మారాయి ఇక్కడి ఎన్నికలు. అటు అధికార, విపక్షాలు ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత ఇలాకా కావడంతో అక్కడ ప్రజాతీర్పు ఎలా వుంటుందోనని యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కుప్పం మున్సిపాలిటీ కి సంబంధించిన 24 వార్డులలో సోమవారం నాడు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల అధికారి చిట్టిబాబు…