టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఫీట్ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా…