హిమాచల్‌ప్రదేశ్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరుసగా ఈ మధ్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. తాజాగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.