కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.
గ్రేటర్ వరంగల్‌లో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త బస్ స్టేషన్ రానుంది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకుంటోంది.
వరంగల్ నగరంలో అభివృద్ధి చేసిన ఉద్యానవనం భద్రకాళి ఫోర్‌షోర్ బండ్ అందాలు నగరవాసులనే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులను తన అందాలతో అదరహో అంటూ కట్టిపడేస్తుంది. వారాంతాలు, సెలవులు మరియు పండుగల సమయంలో, భద్రకాళి సరస్సు పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రక భద్రకాళి సరస్సు వద్ద అభివృద్ధి చేసిన థీమ్ పార్క్ అందాలను చూసి సందర్శకులు మంత్ర ముగ్ధులలవుతున్నారు. ఇక్కడ కొలువు దీరిన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన…