వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు చేయాలని నిర్ణయించారు. రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబరాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా చేయాలని ప్రభుత్వం సూచించింది. మేరకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్…