తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ గద్వాల నియోజక వర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నానని… చేతనైతే సవాల్ ను స్వీకరించాలని పేర్కొన్నారు. తాను చెప్పేది తప్పైతే… రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నీది తప్పైతే నీ ఎంపీ…