శ్రీశైలంలో పర్యటిస్తున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు. శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. అక్కడి అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులతో పాటు జలశక్తి ,ఏపీ జలవరుణ శాఖ అధికారులు వున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్‌ఎంబీ బోర్డు.…
ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష…
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్‌ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్‌ఎంబీ టీమ్…