సినీ పరిశ్రమలో చాలా మంది ప్రణాళికలు వేసుకుని హీరో–హీరోయిన్ గా మారుతారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్‌తో కెరీర్ దొరికిన హీరోయిన్ కృతి శెట్టి. బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ అసలు పుట్టింది మాత్రం ముంబైలో. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపిన కృతి, ముందుగా వాణిజ్య ప్రకటనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అదే నిర్ణయం ఆమెను హీరోయిన్‌గా మార్చింది.…