తాను చాలాసార్లు సీఎం అయ్యానని, ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగరి టీడీపీకి కంచుకోట అని, వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణ జలాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం అని, నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం అని చెప్పారు. సూపర్ సిక్స్ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్ సిక్స్‌లను సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించామని చెప్పారు. పెన్షన్లు, తల్లికి…