సింధూరం, ఖడ్గం, మహాత్మా, మురారి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ మరాఠీలో హిట్ అయిన ‘నట సామ్రాట్’ అనే సినిమాకి రీమేక్ వర్షన్. తనకి సినిమాపై ఉన్న ప్రేమనంతా పెట్టి ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నాడు కృష్ణవంశీ. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ట్రంప్ కార్డ్ ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు, ఆపద సమయంలో…