కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది.. రేపు జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది కేఆర్‌ఎంబీ.. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంతో కీలకంగా మారింది కేఆర్ఎంబీ సమావేశం… ఈ విషయంలో ఇప్పటికే కేఆర్‌ఎంబీకి లేఖలు కూడా వెళ్లాయి.. అయితే, కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న…