Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.
ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు చేరనుంది. వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్. అయితే ప్రస్తుతo ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్…