Hindu woman beheaded, skin peeled off in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులకు, సిక్కులకు రక్షణ లేదనే విషయం మరోసారి తేటతెల్లం అయింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో హిందూ బాలికలను, మహిళలను అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా మానవహక్కుల గురించి, మైనారిటీల రక్షణ గురించి నిత్యం భారత్ పై ఏడుస్తుంది. భారత్ తో…
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం పలు సంవత్సరాలు పాట్లు పడిన చరిత్ర శోభన్ బాబుది. దాదాపు పుష్కరకాలానికి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ విజయంతో స్టార్ అనిపించుకున్నారు శోభన్ బాబు. అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించారు. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత శోభన్ బాబు సైతం అదే తీరున విజృంభించారు. తరువాత “చెల్లెలికాపురం, అమ్మమాట, సంపూర్ణ రామాయణం” వంటి విలక్షణమైన చిత్రాలు, విజయాలూ శోభన్ ను పలకరించాయి. ఆ పై…
ఏప్రిల్ 20న ‘ఉమ్మడి కుటుంబం’కు 55 ఏళ్ళు మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బహుముఖ ప్రజ్ఞ గురించి తెలియని తెలుగువారు ఉండరు. కేవలం నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగా, కథకునిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, ఎడిటర్ గా యన్టీఆర్ సాగిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ఆయన కథలతో రూపొందిన పలు చిత్రాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం సైతం విజయపథంలో పయనించి, అందరినీ అలరించింది.…
(మార్చి 6న నటి కృష్ణకుమారి జయంతి)తెలుగు చిత్రసీమలో పలువురు అక్కాచెల్లెళ్ళు నటీమణులుగా అలరించారు. అయితే వారిలో అక్కను మించిన చెల్లెలుగా పేరొందిన నటి ఎవరంటే ముందుగా కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. తన అక్క షావుకారు జానకి చిత్రసీమలో అడుగు పెట్టిన వెంటనే తానూ కెమెరా ముందుకు వచ్చారు కృష్ణకుమారి. నాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి, అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోల సరసన కూడా హీరోయిన్…
(జనవరి 24న నటి కృష్ణకుమారి వర్ధంతి)అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. కానీ, కృష్ణకుమారిలా మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా యన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాలలో నాయికగా నటించి మురిపించారు. ముఖ్యంగా బి.విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈ నాటికీ అందాల రాజకుమారిగా జనం మదిలో నిలచిపోయారు కృష్ణకుమారి. కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు.…
(అక్టోబర్ 5న వాగ్దానంకు 60 ఏళ్ళు) తెలుగు నాట నవలానాయకునిగా జేజేలు అందుకున్నారు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆరంభంలో బెంగాలీ నవలలతోనే అక్కినేని పలు విజయాలు చవిచూశారు. దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ కు మహానటుడు అన్న ఇమేజ్ లభించింది. దాంతో వరుసగా కొన్ని బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. అవి సంతృప్తి కలిగించాయి. ఈ నేపథ్యంలో దేవదాసు నవల రచయిత శరత్ బాబు రాసిన దత్త నవల…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది.. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కృష్ణకుమారి.. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య.. ఆ దంపతుల పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై. కృష్ణకుమారి…