భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్‌కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు…
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్…
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా…