Nepal: భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు.