అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. మళ్లీ రైల్వే లైన్ పనులు పట్టాలు ఎక్కాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో పనులు పునరుద్ధరించారు.