కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది. కోటిదీపోత్సవం-2024 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.
కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.
కోటి దీపోత్సవం నేపథ్యంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొంది గ్రేటర్ ఆర్టీసీ.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని 18 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ప్రకటించింది.. ఆ వివరాల కోసం.. 99592 26160, 99592 26154 మొబైల్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది..
2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం.. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా ముగిసింది. 14 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణలో మునిగిపోయారు. అంతేకాకుండా.. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలతో అనుదినం వివిధ ప్రత్యేకతలతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
13వ రోజు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇల కైలాసంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు.