భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏడోరోజు సందర్భంగా…