Prakasam: అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరంలో అలల ఎగసి పడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఐదు తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకుంది.