విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే…