జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పిస్తారా..? లేదా..? మార్చిలోనే MLC అయ్యారు నాగబాబు. ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకుంటామని 2024 డిసెంబర్‌లోనే ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి ఎందుకు ఇంత ఆలస్యం. నాగబాబు అమాత్య యోగానికి అడ్డం ఏంటీ..? పవన్ కళ్యాణ్‌కు వేరే ఆలోచన ఏమైనా ఉందా..?
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ…
ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రమే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను ఇదే మొదటిసారి చూడటం అని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించిందన్నారు.
Naga Babu:చిరంజీవి తమ్ముడు అనే ముద్ర నుండి బయటపడి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నాగబాబు. నటనిర్మాతగా తనదైన బాణీ పలికించిన నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా కూడా సదా వార్తల్లో నానుతూ ఉంటారు. ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ ధరిస్తూ బిజీగా సాగుతున్నారు నాగబాబు.
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
విజయనగరం జిల్లాలో నేడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణెదల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. జనసేనా ఫ్యామిలీ చూడడానికి… వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటె నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందన్నారు…
మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు…
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది…