తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు చేయడంతో.. వివరాలు అడిగి తెలుసుకొని, ఆ డాక్టర్ పై అక్కడిక్కడే మంత్రి హరీష్‌రావు సస్సెండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని, అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ…