Off The Record: విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు, మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావిడి, పబ్లిసిటీతో అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకోగా… ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి బాగా….. ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో…
SERP: స్వయం సహాయక సంఘాలలో పుస్తక నిర్వహణ, శిక్షణలో గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ సంఘ సహాయకులు (Village Organisation Assistants) గత ప్రభుత్వంలో విధించిన మూడు సంవత్సరాల కాల పరిమితిని కొనసాగించడానికి చెందిన విజ్ఞప్తిని SERP సానుకూలంగా పరిశీలించింది. ఈ రోజు SERP కార్యదర్శి, ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల జారీ చేసిన ఉత్తర్వుల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. Cough syrup: దగ్గుమందు మరణాలు.. తమిళనాడు సహకరించడం లేదన్న…
Minister Kondapalli: విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణానికి నాంది పలకడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని విషయంలో వెనకబడి ఉన్నాం.. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు.
ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్‌లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారని, బడ్జెట్‌లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల…
ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో…
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు.