కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్ ఫైట్‌తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్ వాచ్..! వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..! ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం…