కోనసీమ జిల్లా మార్పు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. కోనసీమ జిల్లా పేరును ప్రభుత్వం ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని మళ్లీ డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. జిల్లా పేరు మార్పుపై జరిగే ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్ విధించినా లాభం లేకపోయింది. Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..! పోలీసులు ఎటువంటి సమావేశాలు,…
కోనసీమ జిల్లా ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఎస్పీ సుబ్బారెడ్డి… కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు.. సెక్షన్ 144 అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు…
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పేరు మార్చాలని ఆందోళనలు, నిరసనలు జరగ్గా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ కొందరు వ్యతిరేక గళం చాటుతుండటంతో గందరగోళం నెలకొంది. Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వారం రోజుల…
కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ…
కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడి దయతో ఈరోజు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు జగన్ వివరించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో…
సాధారణంగా ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఐదు అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు, పాదచారులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే ఇదే తరహాలో రెండు ప్రమాదాలు జరగడంతో ఆయా బస్సులను నడిపిన డ్రైవర్లు ఆరు నెలల పాటు సస్పెండయ్యారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఆర్టీసీ పరిహారం…
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త…