MLC Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి.గన్నవరం మండలం ముంగండ అనే గ్రామానికి వచ్చారు. ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. భోగి ప్రతి ఇంట భోగభాగ్యాలు కలిగించాలని కోరుతూ భక్తి పార్వసంగా సంబరాలు జరిగాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ప్రారంభించారు.
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం…
CM Jagan: ఏపీ సీఎం జగన్ నెలరోజుల కిందట కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఎంతో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ… తాజాగా ఆ బాలిక…
ఇక, కోనసీమ జిల్లా పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. మే 18న దీనికి సంబంధించిన ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, జూన్ 24న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.. ఇప్పుడు ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ తో ఇక నుంచి డా బీఆర్ అంబేద్కర్ కోనసీమగా జిల్లాగా మార్చేసింది.. కాగా, ఇటీవల జిల్లాల పునర్‌వ్యస్థీకరణలో అమలాపురం పార్లమెంటు…
కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో ఆకుల వారి వీధిలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది… ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు సజీవదహనం అయ్యారు.. తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తల్లీ కుమారైలు.. సాధనాల మంగాదేవి (40), మేడిశెట్టి జ్యోతి (23) సజీవ దహనం అయ్యారు.. అయితే, ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం…
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డా.బీఆర్.అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై కోనసీమ జిల్లా డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. కేబినెట్‌లో 32వ అంశంగా కోనసీమ జిల్లా పేరును కేబినెట్ ప్రతిపాదించింది. ఇటీవల కోనసీమ జిల్లా మార్పు అంశంపై అమలాపురంలో తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా…
గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని…