కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనో సంచలనం. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. తాను మచ్చలేని రాజకీయా నాయకుడిని అని చెప్పుకొచ్చారు మాజీమంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20ఏళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న తాను ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేసారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేసారు. తాను అధికారపార్టీలో…
తెలంగాణ కాంగ్రెస్ కి జవజీవాలు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఖుషీగా వుంది. శ్రీరామనవమి సందర్భంగా రామగిరిలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేసీఆర్…
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్‌కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని… పలుమార్లు కేంద్ర మంత్రులను, రైల్వే అధికారులను కలిసి విన్నవించినందుకు ఆమోదం రావడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదగిరిగుట్టకు రాష్ట్ర రాజధాని నుంచి రవాణా సౌకర్యం చాలా సులభం అవుతుందని… అలాగే భక్తుల తాకిడి…