Mechanic Trailer Launched by Komatireddy venkat reddy: టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన ‘మెకానిక్’ ఫిబ్రవరి 2న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. . ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా అందించిన ఈ సినిమాకి నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలుగా వ్యవహరిచిన ఈ సినిమా ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన సాంగ్స్ 10 మిలియన్ వ్యూస్ దగ్గరకు వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
TS Politics: నేడు ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం..
ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎంతోమంది జీవితాలు ఈ ఫ్లోరైడ్ నీటి వల్ల నాశనం అయ్యాయని,. రాబోయె రెండు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాతంగా చేస్తామన్నారు. ఈ ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని, సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ వంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలని దీని ద్వారా సమాజానికి ఈ సమస్య, బాధితుల బాధలు అర్ధమవుతాయని అన్నారు. ఈ చిత్రం తప్పకుండా మoచి విజయం సాధిస్తుందన్నారు ఆయన. తనకెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, కిరీటి, జబర్ధస్త్ దొరబాబు, జబర్ధస్త్ పణి, సంద్య జనక్, సునీత మనోహర్,మాస్టర్ చక్రి తదితరులు నటించిన ఈ సినిమాకి వినోద్ సంగీతం అందించారు.