కోలీవుడ్ స్టార్ శింబు (STR) హీరోగా, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న సినిమా ‘అరసన్’ మీద అప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. శింబు కెరీర్‌లో 49వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అరసన్’ అంటే “రాజు” అన్న అర్థం. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందనే…
Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది.
సినీ ప్రపంచంలో అవకాశాలు ఎంత కీలకమో మనకు తెలిసిందే. అప్పటికే రాసిపెట్టిన పాత్రలు, ఊహించని స్టార్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు ‘కూలీ’ సినిమా లో కూడా జరిగింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం, ఓ కీలకమైన పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా ఆరు నెలల పాటు డిజైన్ చేశారట. ఈ పాత్రకు గుర్తింపు ఉన్న నటుడే అవసరమని భావించిన లోకేష్, మొదట ఫహద్ ఫాసిల్ను సంప్రదించారు. కానీ…