Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్
- కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి..
- నిన్నటి కంటే రెండు అడుగుల మేర పెరిగిన కొల్లేరు నీటి మట్టం..
- 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బిక్కు బిక్కుమంటున్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక, ఏలూరు- కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ఇంకా కొల్లెరుకు వరద నీటి ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగి పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.
Read Also: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అయితే, ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. చిన్న ఆడ్లగడ దగ్గర రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు.
Read Also: Uttarpradesh : ఘోర ప్రమాదం.. రెండు కార్లు, ఈ రిక్షాలు ఢీ.. ఐదుగురు మృతి
మరోవైపు, బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బండరాళ్లను తెచ్చి గండ్లను అధికారులు పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50, 60 మీటర్ల మేర పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక, మూడో గండి పూడ్చివేత పనులను హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ అధికారులు పరిశీలించారు. వంతెన వేసి గండిని పూడ్చాలని ఆర్మీ డైరెక్షన్ ఇచ్చింది. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల పర్యవేక్షణకు మూడు రోజుల నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మకాం వేశారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి