టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా కోలుకున్నారు. శుక్రవారం గంగూలీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల క్రితం కొంచెం అలసటగా ఉండటంతో గంగూలీ…
నిన్న షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీగా తగ్గింది. ప్రతి కిలో గ్రాము వెండి పై రూ. 300 వరకు తగ్గింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.…
ప్రపంచ వాతావరణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వేడి పెరిగిపోయింది. ఈ వేడి కారణంగా దృవాల వద్ద మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా నదుల్లో, సముద్రాల్లో నీటిమట్టం పెరిగిపోతున్నది. నీటిమట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇబ్బందులు ఎదర్కొననున్నాయి. 2030 నాటికి సముద్రాల్లోని నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం పెరిగితే అనేక నరగాలు…
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేబినెట్లో సీనియర్ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ గురువారం కన్నుమూశారు.. ఆయన వయస్సు 75 ఏళ్లు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు.. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిని సందర్శించిన సీఎం మమతా బెనర్జీ.. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న సుబ్రతా ముఖర్జీ.. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని…
ఈరోజు ముంబై, కోల్‌కతా జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించడంతో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. అయితే, ఓపెనర్లు ఔటయ్యాక మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. కొద్దిసేపటి క్రితమే టాస్ వేయగా, కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నది. ఇప్పటికే ముంబై జట్టు తన మొదటి మ్యాచ్‌లో చైన్నైపై ఓటమి పాలైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నది. అయితే, కోల్‌కతా జట్టు బెంగళూరుపై అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని…
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్‌లు పెట్టారు.…
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీపైన, ప్రధాని మోడీపైన పలురకాల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్ర చాయ్‌వాలా అవతారం ఎత్తారు. ప్రజలకు ఆయన ఉచితంగా టీ తయారు చేసి అందించారు. టీ ధర రూ.15 లక్షలు అని ప్రజలు రూ.15 లక్షలు కట్టాలని, 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి…