కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. ఒక్కో సారి యజమాని కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కాపాడిన కుక్కల గురించి చాలా కథలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే మరోసారి కోల్‌కతాలో జరిగింది. దొంగ బారి నుంచి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా.. దొంగను పట్టించింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని జాదు భట్టాచార్య లైన్ లో ఓ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. సదరు ఇళ్లు బెంగాల్ సీఎం ఇంటికి…
దశాబ్ధం క్రితం పోలియో వైరస్ నుంచి దేశం నుంచి తరిమేశాం. దేశంలోని పోలియో పట్ల అవగాహన కల్పించడంతో విధిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో పోలియో సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా తయారైంది. 2011లో వెస్ట్ బెంగాల్ హౌరాకు చెందిన 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకింది. భారత దేశం మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల నుంచి నుపుర్‌కు నోటీసులు వెళ్తున్నాయి.. తాజాగా, కోల్‌కతా పోలీసులు షాక్ ఇచ్చారు. నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 153ఏ, 295ఏ, 298 మరియు 34 సెక్షన్‌ల కింద నుపుర్ శర్మపై కేసు నమోదు చేశారు కోల్‌కతా పోలీసులు.. ఇక, 41ఏ CrPC కింద జూన్ 20వ తేదీన తమ ముందు…
అందరికీ ఏవో కలలు ఉంటాయి.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి బైక్‌పై లడఖ్ వరకు బైక్‌పై వెళ్లాలనేది డ్రీమ్.. అయితే, అతడు అమ్మేది టీ.. బైక్ కొనే ఆర్థిక శక్తి అతడికి లేదు.. అయినా పట్టు వదలలేదు.. వెనక్కి తగ్గలేదు.. లడఖ్‌కు కాలి నడకన చేరుకుని ఔరా..! అనిపించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా సమీపంలోని హుగ్లీ జిల్లాకు చెందిన మిలన్ మాఝీ అనే టీ అమ్మే వ్యక్తి కోల్‌కతా నుండి లడఖ్‌కు కాలినడకన చేరుకున్నాడు..…
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత…
హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్‌లో కాదు.. కోల్‌కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతాలో లిక్కర్ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్పేర్కొంది.…
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.…
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్లను అందించారు. కోల్‌కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయన కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కేకేను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి తీసుకెళ్లారు.…