టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా కోలుకున్నారు. శుక్రవారం గంగూలీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి వీడ్కోలు పలికారు.

నాలుగు రోజుల క్రితం కొంచెం అలసటగా ఉండటంతో గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు గంగూలీ వెంటనే కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. కాగా ఇప్పటికే 49 ఏళ్ల గంగూలీ రెండు సార్లు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ ఏడాది గంగూలీకి యాంజియోప్లాస్టీ కూడా జరిగింది.
Read Also: లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్