టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణలు కొలికపూడి నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల జరిగిన వరస సంఘటనలపై ఎమ్మెల్యేను క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, గిరిజన మహిళ విషయంలో కేసు కూడా నమోదు కాలేదని కొలికపూడి…