పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి…
కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజకీయ హీట్ ఉత్కంఠ రేపుతుంది. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నేతలిద్దరూ అధికార గులాబీ పార్టీకే చెందినవారే అయితే వీరిద్దరూ ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవడం చర్చకు దారి తీస్తోంది. బహిరంగ చర్చకు సిద్దమంటూ ఒకరిపై మరొకరు ఛాలెంజ్ విసురుకోవడంతో.. ఆదివారం కొల్లాపూర్ లో టెన్షన్…
ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్ దంపతులు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఫ్యామిలీ బయల్దేరనుంది.. ఇక, కుటుంబసభ్యులతో కలిసి కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. మహలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.. కాగా, ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు కేసీఆర్……