Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే..: క్రీడా రంగంలో.. ముఖ్యంగా క్రికెట్‌లో.. కోహ్లి, ధోని, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ వాణిజ్య ప్రకటనలతో దూసుకెళుతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 505 సంస్థలు సెలెబ్రిటీలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోగా.. అందులో ఏకంగా 381 ఒప్పందాలను క్రికెటర్లతోనే కుదుర్చుకోవటం విశేషం. మొత్తం డీల్స్ వ్యాల్యూ 749 కోట్ల రూపాయలు.
స్మృతి మంధాన ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడి బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్ గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్ గా వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్ గానూ పూర్తిగా విఫలమైంది.
ఐపీఎల్ 15 వ సీజన్ టైటిల్ ని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. ఈ జట్టు అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. మెగా వేలం తరువాత ఈ జట్టు పట్ల చాలామంది విమర్శలు చేసారు. అయితే ఆ విమర్శలకు గట్టిగా జవాబిస్తూ టైటిల్ ని గెలుచుకుంది గుజరాత్ జట్టు. ఐపీఎల్ 15వ సీజన్లో చాలా మంది యువ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. కోహ్లీ,రోహిత్,పంత్, ధోని లాంటి సీనియర్ ఆటగాళ్లు…
మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీపైనే అందరీ కళ్లు ఉన్నాయి. మొహాలీ వేదికగా జరిగే టెస్టులో… సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు… మరో 38 పరుగులు చేస్తే… 8వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరంద్ర సెహ్వాగ్… దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు…
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ…
దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదన్నారు. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్‌లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీ మధ్య గొడవ.. దేశ క్రికెట్‌కు మంచిది కాదని సూచిస్తున్నారు సీనియర్లు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు…ఇలా గొడవ పడితే…దీని ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు గొడవలు జరిగితే…ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందన్నారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ఎంత గొప్పదో.. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్ప విషయమన్నారు. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం.. మంచి…
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒక అలజడి ఉన్న విషయం తెలిసిందే. నిన్న విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కోహ్లీ వ్యాఖ్యలతో ఆయనకు, బీసీసీఐకి మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానంటే తాను వద్దని చెప్పినట్టు ఇటీవల గంగూలీ తెలిపాడు. అయితే బీసీసీఐ అలా చెప్పలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు మాత్రమే బీసీసీఐ తనను కాంటాక్ట్ చేసిందన్నారు కోహ్లీ. టీ20…
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్…
విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుండి తప్పిస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ. దాంతో కోహ్లీ అభిమానులు బీసీసీఐ పై చాలా కోపంతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వారిలో కోపాన్ని మరింత పెంచింది. అదే బీసీసీఐ కోహ్లీకి ధన్యవాదాలు చెప్పడం. అయితే ఇన్ని రోజులు వన్డే…