భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్‌లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…