ఐపీఎల్ 2025లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నై చెపాక్ కోటను బద్దలు కొట్టింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ విజయం అనంతరం.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు.