క్రికెట్‌లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్‌లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని…