కరీంనగర్లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు.
Cock Bird Found in Jadcherla Police Station Lockup: సాధారణంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో నేరస్థులు ఉంటారు. నేరాలు, ఘోరాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వేస్తారు. ఇందుకు బిన్నంగా లాకప్‌లో ఓ కోడిపుంజు ఉంది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా లాకప్‌లో ఉన్న కోడిపుంజు కూస్తూనే ఉందట. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు…