తెలుగు చిత్రసీమలో ‘స్వర్ణోత్సవాలు,వజ్రోత్సవాలు’ అన్నవి ఏ నాటి నుంచో ఉన్నప్పటికీ వాటికి క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వారిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం! వారే దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యకోటిలో ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్న కోడి రామకృష్ణ. దాసరి తన తొలి చిత్రం ‘తాత-మనవడు’తో ‘స్వర్ణోత్సవం’ చూశారు. శిష్యుడు కోడిరామకృష్ణ కూడా తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’తో ఏకంగా 510 రోజుల చిత్రాన్ని చూపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్…