కొత్త పీసీసీని ప్రకటించగానే ఆయన తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. అయినప్పటికీ పార్టీ ఆయనతో మాట్లాడుతూనే ఉంది. ఆ నాయకుడు మాత్రం గడప దాటడం లేదు. పాతచోటే ఉంటారా.. లేక కొత్త గూటిని వెతుక్కునే పనిలో పడ్డారా అన్నది అంతుచిక్కడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత మౌనంగానే ఉండిపోయారు! తెలంగాణలో ఆయారాం గయారాంల సందడి పీక్‌కు చేరుకుంటోంది. గోడ దూకేవాళ్లు దూకేస్తున్నారు. మెడలో కొత్త కండువాలు కప్పేసుకుంటున్నారు. కొందరు…