ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
వ్యాక్సినేషన్ పంపిణి పై హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ పై కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చిని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉంది. విదేశాంగ మంత్రి వ్యాక్సిన్ ముడి సరుకు కోసం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. దేశంలోని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక్కటే వ్యాక్సిన్…
ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలన్న కిషన్ రెడ్డి… నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తాడు. బండి సంజయ్, నాతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారు. ఈటల చేరికను ముఖ్యనేతల సహా.. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అసంతృప్తులు సహజం. సీనియర్ నేత పెద్దిరెడ్డి…
తెలంగాణకి 71 లక్షల 23 వేల 50 వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ 65,86,650 డోస్‌లు.. 27 ప్రైవేట్ హాస్పిటల్స్ కి 5,36 ,600 డోస్‌లు చేరాయి. రేమిడిసివిర్ తెలంగాణకి 3 లక్షలు.. ఆంధ్ర కు 6 లక్షలు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది. ఇతర దేశాల నుండి వ్యాక్సిన్ ప్రోక్యూర్ పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుంది అని అంటున్నాయి.. కేంద్రం…
రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ ఇస్తాం అని తెలిపారు. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలి. కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుంది. కరోనాతో చనిపోతున్న…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు…
కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం మే, జూన్ మాసాలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది. ప్రజల అవసరాల మేరకు అవసరమైతే పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. భాజపా అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు సేవా హి సంఘటన పేరుతో పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. దేశ వ్యాప్తంగా మాస్కులు, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని…
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమైక్యాంధ్రలో వరంగల్ నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పిన ఆయన పోరాడి సాధించిన తెలంగాణలోనూ ఏడేళ్లుగా అభివృద్ధి జరగలేదు. వరంగల్ వరదలే దానికి నిదర్శనం. వరంగల్ వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసి వదిలేశారు. రైల్వే ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి ఇప్పటికీ ల్యాండ్ ఇవ్వలే. బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే వరంగల్ ను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం…
భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు క్రాస్ చేయగా.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే ఇవాళ కాస్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఇక, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి… కేసులు భారీగా…