ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు. ఈ కొవిడ్ కష్టకాలంలో చిరంజీవి నిస్వార్థ సేవలు ప్రశంసనీయం అని కిషన్ రెడ్డి తెలిపారు.