దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని.. రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 2000 చొప్పున 6000 అందిస్తుందని చెప్పారు. రైతును రాజు చేయాలనే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు…