Tractor March: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతు సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు నుంచి పలు కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా( KMM)లు ఓ ప్రకటన రిలీజ్ చేశాయి. ఈ సందర్భంగా కేఎంఎం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ వరకు ఢిల్లీకి రైతుల పాదయాత్ర 200 రోజులు పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు.
Read Also: Tirumala Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్ దర్శన టికెట్లు విడుదల
అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు రైతులు పాదయాత్రలు నిర్వహించి అధికార భారతీయ జనతా పార్టీ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు తెలిపారు. ఆగస్టు15వ తేదీన దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరీ, శంభు పాయింట్ల దగ్గర ప్రజలు గుమికూడాలని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించి.. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.